రంగారెడ్డి జిల్లా మహా:
దేశ వ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్ యోజన) పథకం ప్రవేశ పెట్టిందని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. ఆదివాసీలకు మౌళికవసతుల ఏర్పాటులో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూపొందించిన ప్రణాళికలో భాగంగా 2019 – 2024 గ్రామపంచాయతీ పాలకవర్గ సమయంలో సర్పంచులు అందించిన సేవలకు గాను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో పలువురు మాజీ సర్పంచులకు ప్రశంసా పత్రాలు అందించినట్లు తెలిపారు. శనివారం కడ్తాల్ మండల కేంద్రం విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీరు కార్యాలయం ఆవరణలో కడ్తాల్,అన్మాస్పల్లి,ఎక్వాయి పల్లి సర్పంచులకు సూపరిండెంట్ ఇంజనీర్, రాజేంద్రనగర్ శ్రీరామ్ మోహన్ చేతుల మీదుగా ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్ యోజన) పథకం ద్వారా అందించిన సేవలకు ప్రశంసా పత్రాలు అందించినట్లు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి తెలిపారు.ఈ పధకం ద్వారా విద్యుత్,సురక్షిత త్రాగునీరు,విద్య మరియు జీవనోపాధి పథకాలు ఆదివాసీలకు చేరువయ్యేలా కృషి చేసినందుకు గాను ప్రశంసా పత్రాలు అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రశంసాపత్రం అందించిన అధికారులకు, ప్రోత్సహించిన గ్రామ ప్రజలకు మరియు పాలకవర్గం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసారు. అన్మాస్పల్లి మాజి సర్పంచ్ శంకర్, ఏడిఈ- ఆమనగల్ బాలకృష్ణ, ఏడిఈ- మామిడిపల్లి శంకర్, ఏఈ- కడ్తాల్ నరేందర్ పటేల్,మాజీ వార్డు సభ్యులు రామచంద్రయ్య,నాయకులుఅశోక్ ముదిరాజ్,కృష్ణయ్య,యాదయ్య గౌడ్,గండికోట శేఖర్,విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








