Mahaa Daily Exclusive

  అవినీతి అధికారిని పై విచారణ ? ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం !

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిని గత వారం రోజుల క్రితం, అవినీతి అక్రమాలపై విచారణ ఎదుర్కోవడం జరిగింది. ఆ అధికారినీపై అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు అభియోగాలు రావడంతో, ఆమెపై విచారణ జరిపినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గతంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యాలయంలో విధులు నిర్వహించిన జిల్లా అధికారి, 2021- 22 సంవత్సరంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెలుబుచ్చాయి.
మహిళా మత్స్య పారిశ్రామిక అధ్యక్షురాలు ఆరోపణలు చేస్తూ, ఇచ్చిన ఫిర్యాదు మేరకు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ నిజ నిర్ధారణ అధికారులను నియమించి, విచారణ చేసినట్లు విశ్వాసనీయ సమాచారం మేరకు తెలిసింది. వారం రోజుల క్రితం మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో విచారణ చేపట్టినట్లు సమాచారం.

Latest