Mahaa Daily Exclusive

  ప్రొక్యూర్మెంట్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ..!

Share

వరంగల్ మహా;

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం ఖిలా వరంగల్ మండలం లోని తిమ్మాపూర్ నక్కలపల్లి రోడ్డు లోని పద్మావతి ఇండస్ట్రీ, మహాలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్, పర్వతగిరి మండలం కొంకపాక, చౌటపల్లి, జమాల్పూర్ గ్రామాల్లోని పాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సెంటర్లనుండి వచ్చిన ధాన్యాన్ని లారీ ట్రాన్స్
పోర్ట్ ల ద్వారా త్వరగా దిగుమతి చేయాలని మిల్లర్ల ను ఆదేశించారు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో ధాన్యం తడిసిపోకుండా, టార్పాలిన్ అందుబాటులో ఉండేలా చూడాలని,తడిసిన ధాన్యాన్ని వెంటనే ఎండబెట్టి తడి ఆరిన ధాన్యాన్ని మిల్లు లకు చేర్చేందుకు ధాన్యం కొనుగోలు సెంటర్ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిఓ నీరజ,
డిఎంసివిల్ సప్లై అధికారి సంధ్యారాణి, మిల్లర్ యజమాన్యం, సంబంధిత పిపి సెంటర్ నిర్వాహకులు, తదితరులు, పాల్గొన్నారు.

Latest