Mahaa Daily Exclusive

  శుభ్రత, ట్రేడ్ లైసెన్స్ లేని హోటల్స్ కు జరిమానా రూ.62 వేల జరిమానాలు విధింపు..!

Share

వరంగల్ మహా;

గ్రేటర్ వరంగల్ నగరంలో అపరిశుభ్ర పరిస్థితుల్లో, ట్రేడ్ లైసెన్స్ లేకుండా హోటల్స్ నిర్వహణకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయానికి గాను మొత్తం రూ.62 వేలు జరిమానా విధించినట్లు బల్దియా ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజారెడ్డి తెలిపారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ
కమిషనర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం నగర పరిధి లోని పలు హోటళ్లు, రెస్టారెంట్ లు షాపులను శానిటేషన్ అధికారులు తనిఖీలు చేపట్టి అపరిశుభ్ర పరిస్థితుల్లో హోటల్‌ నడుపుతున్న 51 వ డివిజన్ పరిధి లోని ఎక్సైజ్ కాలనీ లో గల నాటుకోడి చిట్టి గారెలు హోటల్ కు రూ.30 వేలు ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా రెస్టారెంట్ నిర్వహిస్తున్న హంటర్ రోడ్ లోని కడాయి రెస్టారెంట్‌కు రూ. 30 వేలు నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న వెంకట సాయి కిరాణా షాపు యజమానికి రూ.2 వేలు జరిమానా తో కలిపి మొత్తం గా రూ.62 వేల జరిమానా విధించినట్లు సి ఎం హెచ్ ఓ తెలిపారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్, సంపత్ రెడ్డి, నిరంజన్, అనిల్, ప్లాస్టిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం, సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు.

Latest