వరంగల్, మహా;
మన సనాతన హిందూ సేవా సమితి నుండి 63 వ సేవా కార్యక్రమంలో భాగంగా చిన్న వయసులోనే భర్తను కోల్పోయి పిల్లల పోషణ తో పాటు చదువులకు ఇబ్బంది గా మారి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న హన్మకొండ హంటర్ రోడ్ లోని విద్యుత్ నగర్ కు చెందిన చేలిక సునీత కు మన గ్రూప్ సనాతన హిందూ సేవా సమితి నుండి రెండు నెలలకు సరిపడా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా సునీత గ్రూప్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన గ్రూప్ వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు, గ్రూప్ సభ్యులు నోముల మహేష్ బాబు, పడకంటి రామ్ చందర్,మాలోత్ రవి, సత్తు శ్రీకాంత్, గందమళ్ళ సాయి కుమార్,బడుగు రాము, వైట్ల నాగరాజు, మేకల శశికాంత్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 27








