Mahaa Daily Exclusive

  అత్యంత శక్తి వంతమైన ప్రచార సాధనం సోషల్ మీడియా ప్రస్తుతం సోషల్ మీడియాకు యువత అడిక్ట్ అయ్యింది వరంగల్ ఎంపీ డా కడియం కావ్య..!

Share

జనగామ మహా;

అత్యంత వేగంగా సమాచార సేకరణకు సోషల్ మీడియా ఆయుధంగా మారిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన స్టేషన్ ఘనపూర్ సోషల్ మీడియా వారియర్స్ వర్క్ షాప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య , టీపిసిసి సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నే సతీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ

ప్రస్తుతం వార్త ప్రసార సాధనాలతో అవసరం లేకుండా ప్రపంచంలో ఎక్కడ ఎం జరిగిన సోషల్ మీడియా ద్వారా క్షణాలలో తెలిసిపోతుందని అన్నారు. అందుకే సోషల్ మీడియా అత్యంత శక్తివంతమైన సాధనంగా మారిందని తెలిపారు. ప్రస్తుతం యువత సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారని అన్నారు. రాజకీయ రంగంలో సైతం సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. అందుకే కొన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాపై వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో బిఆరఎస్ పార్టీ అధికారం కోల్పోయాక సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకొని విదేశాలలో కార్యాలయాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యలనుప్రచారం చేస్తుందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ సైతం సోషల్ మీడియా ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగానే నేడు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ వర్క్ షాప్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మెదటి సారిగా నిర్వహించినట్లు వెల్లడించారు. సోషల్ మీడియా వారియర్స్ ను స్థానిక మండల, గ్రామ నాయకులు కలుపుకొని వెళ్లాలని, వారిని ప్రోత్సాహించాలని సూచించారు. స్థానిక నాయకత్వం వారికీ అండగా నిలవాలని తెలిపారు. సోషల్ మీడియా, యువజన కాంగ్రెస్ విభాగలలో అక్టివ్ గా పని చేసే వారికీ ప్రభుత్వ పథకాలలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్దే ఎజెండా గా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు.

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం సోషల్ మీడియా సమన్వయకర్తలదే ముఖ్య పాత్ర ఉంటుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. అంతేకాకుండా ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా మధ్యమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడం తో పాటు ప్రతిపక్షాల ద్వారా కలిగిన, కలుగుతున్న కష్టాలను, నష్టాలను వివరించాలన్నారు.
ప్రతిపక్షాల అసత్య ప్రచాలను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. పార్టీ కొరకు
కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్, యువజన కాంగ్రెస్ నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Latest