Mahaa Daily Exclusive

  ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతి..!

Share

ఖమ్మం జిల్లా, ఏన్కూర్ మండల పరిధిలోని కొత్త మేడేపల్లి గ్రామానికి చెందిన మడకం సోమార్ (40) పశువులు, మేకల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన ఇద్దరు కుమార్తెలు సంధ్య, అంజలితో కలిసి రోజు లాగే ఉదయం 10 గంటలకు పశువుల మేత కోసం అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. సాయంత్రం సమయంలో ఎలుగుబంటి వారిపై దాడి చేయడంతో భయంతో పిల్లలు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లితో ఈ విషయం చెప్పగా, తల్లి గ్రామస్థులతో కలిసి వెళ్లి గాయలతో ఉన్న సోమార్ ని కొత్తగూడెం హాస్పటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు సోమార్ మృతి చెందాడు. సోమార్ భార్య కుమారి ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్సై రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest