Mahaa Daily Exclusive

  కూసుమంచిలో విత్తన దుకాణాలను తనిఖీ చేసిన జేడీఏ..!

Share

కూసుమంచి, మే 5, మహా:

కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం, పాలేరు కూసుమంచి గ్రామాలలోని ఎరువులు, పురుగుమందులు విత్తన దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల విక్రయాలను పిఓఎస్ మిషన్ ద్వారా మాత్రమే చేయాలని సూచించారు. వానకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు. ఎరువులు, పురుగు మందులు మరియు విత్తనాలకు సంబంధించి స్టాక్ రిజిస్టర్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, డీలర్లు తప్పనిసరిగా లైసెన్స్ ను ప్రదర్శించాలని స్టాక్ బోర్డ్ ను ధరల పట్టికను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. ఓ ఫార్మ్స్ పీసీలు తప్పనిసరిగా లైసెన్స్ లో పొందుపరచాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి పాల్గొన్నారు.

Latest