Mahaa Daily Exclusive

  నూతన వస్తాలంకరణ మహోత్సవానికి హాజరైన తల్లాడ మాజీ ఎంపీపీ….!

Share

తల్లాడ, మే, 4( మహా):

నూతన వస్త్రాలంకరణ మహోత్సవం తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు గొడ్ల బాబురావు ఉమారాణిల కుమార్తె సృజన,నూతన వస్త్రాలంకరణ కార్యక్రమం వారి కుమారుడు నవదీప్ కు పంచకట్టు వేడుక ఆదివారం అన్నారుగూడెం గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి తల్లాడ మండల మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు హాజరై వారిని అక్షింతలు వేసి దీవించారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు..

ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు తల్లాడ మండల మాజీ జెడ్పిటిసి దిరిశాల ప్రమీల,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వీర మోహన్ రెడ్డి,ఆ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దుగ్గిదేవర వెంకటలాల్,ఆ పార్టీ జోనల్ సభ్యులు దిరిశాల దాసురావు, నాయకులు మారెళ్ళ దేవేందర్,అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇస్నపల్లి శ్రీనివాసరావు, ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ పగిడిపల్లి వెంకటేశ్వరరావు,గోడ్ల వెంకటరత్నం, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Latest