ఖమ్మం మే 04, మహా.
గత రెండున్నరేళ్లుగా
పాలేరు నియోజకవర్గ పరిధిలో పాపటపల్లి నుంచి జాన్ పహాడ్ వరకు, పాపటపల్లి నుంచి గద్వాల్ వెళ్ళే రైల్వే లైన్లు పాలేరు నియోజకవర్గoలో మార్కింగ్ చేసినందున 4 మండలాల ప్రజలు చాలా ఆందోళనకు గురైన విషయం విధితమే. ఖమ్మం ఎంపీ రామ సాయం రఘురామిరెడ్డి చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనతో కేంద్ర రైల్వే మంత్రితో పార్లమెంట్ లో మాట్లాడి రైల్వే లైన్ కు చెందిన ఎలైన్ మెంట్ ను మార్చాలని కోరడం జగిందని ఖమ్మం ఎంపీ రామ సహాయము రఘురాంరెడ్డి అన్నారు.. ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సయ్యద్ సాదిక్ అలీ ఆధ్వర్యంలో రైల్వే లైనుకు చెందిన బాధిత రైతులతో ఆయన కాసేపు ముచ్చటించారు.. ఈసందర్భంగా పలు అంశాలను సయ్యద్ సాదిక్ అలి… ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా… రైల్వే లైన్ రీ సర్వే అలైన్మెంట్ అంశాలను పార్లమెంటులో రైల్వే మంత్రికి విన్నవించడం జరిగిందని త్వరలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు..ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి ని కలిసిన వారిలో రైతులు ఉప్పల్ రావు, లెనిన్, యుగంధర్, పట్టాభి , పుచ్చకాయల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు








