- ఎమ్మెల్యే పై తప్పుడు ఆలోచనలు మానుకోవాలి.!
- బీఆర్ఎస్ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ పై ఆగ్రహం వ్యక్తం
- ఉప్పరిగూడ పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 7 మహా:
ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారం చేస్తూ ఆవాకులు చవాకులు పేళ్తున్న, బీఆర్ఎస్ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ పై, ఉప్పరిగూడ పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మా లక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందని తెలుసుకోవడానికి బస్సు ఎక్కి మహిళలు విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్లకు చేకూరుతున్న లబ్ధి గురించి, సమస్యల గురించి ముచ్చటించి అడిగి తెలుసుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్, తప్పుడు ఆలోచనతో తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని లేదంటే తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని, ఉప్పరిగూడ పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి హెచ్చరించారు.








