- వందకు పైగా సిన్మాల్లో పాటలు రాశా
- రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ అన్నిప్రాంతాల సాహిత్యం రాశా
- క్రేజీ కల్యాణం మూవీ పాటల్లో ప్రయోగం చేశా
- ఎఎన్ఎన్, మహాతో ప్రముఖ కవి గోరటి వెంకన్న
– ఇంటర్వ్యూ
హైదరాబాద్, మహా
నను గన్న నా తల్లి రాయలసీమ అంటూ శ్రీరాములయ్య సినిమాలో పాటలు రాసిన తాను తన సినీప్రస్థానంలో వందకు పైగా సినిమాలకు పనిచేశానని, ప్రజాసాహిత్యంలో, సిన్మాలో ఎక్కడ తన అవసరం ఉంటే అక్కడ పనిచేశానని, ప్రకృతితో పెనవేసుకున్న పదాలే సాహిత్యంగా మారాయని ప్రముఖ కవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. సోమవారం ఎఎన్ఎన్-మహా కార్యాలయానికి వచ్చిన ఆయనను సీఈవో కంది రామచంద్రారెడ్డి సత్కరించారు. శ్రీరాములయ్య, కుబుసం, ఎన్ కౌంటర్, బతుకమ్మతో పాటు అనేక చిత్రాలకు పాటలను అందించానని, గల్లీచిన్నదే కాకుండా అనేక పాటలు ప్రజల్లోకి వెళ్ళి నిలిచిపోయాయన్నారు. ప్రజల నుండి ప్రకృతి నుండే సాహిత్యం పుట్టిందన్నారు. క్రేజీ కల్యాణం మూవీలో నిర్మాత జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు కావడం వల్ల పాటలు రాశానని, తొలిసారి రొమాంటిక్ పాటలు కూడా తనతో రాయించారని. ఈనెలాఖరులో సిన్మా రిలీజవుతుందన్నారు. ప్రజలు కోరుకుంటే, కథలు కోరుకుంటే ఇంకా సినిమాలకు సాహిత్యాన్ని అందిస్తానన్నారు. ఎఎన్ఎన్ ప్రేక్షకులకు, మహా పత్రిక ప్రేక్షకులకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ, పాలపిట్టపై తాను అనేక అద్భుతమైన పాటలు రాశానన్నారు.
……….








