- కేడీసీ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ ను నియమించాలి
- స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్
హనుమకొండ, మహా;
కేడీసీ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ ను నియమించాలని
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేసారు. అనంతరం ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ తరగతి గదులు, మంచినీటి సదుపాయం లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురైతున్నారని ఒకవైపు మొర పెట్టుకుంటే మరోవైపు తరగతి గదులను ధ్వంసం చేసి చిన్నారులను, విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్న ఇన్చార్జి ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ ను వెంటనే తొలగించి రెగ్యులర్ ప్రిన్సిపాల్ నియమించాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ శివ కుమార్ కేడీసీ కాలేజ్ అధ్యక్ష కార్యదర్శులు రాజ్ కుమార్ వంశీ తదితరులు పాల్గొన్నారు.








