- కోటిలింగాల ఆలయ పైపుల చోరీ
- అటోలో తరలిస్తుండగా పట్టుకున్నగ్రామస్తులు
కారేపల్లి, మహ : కారేపల్లి మండలంలో ప్రసిద్ది చెందిన కోటిలింగాల ఆలయ ప్రాంగణంలోని ఇనుప పైపులు చోరి జరిగింది.
ఆలయం అటవీ ప్రాంతంలో ఉండటంతో రాత్రి అయితే ఆలయం వద్ద ఎవరు ఉండరు. దీనిని దొంగతనానికి అనువుగా చేసుకున్న కొందరు యువకులు ఆలయం ప్రాంగణంలోని వస్తువులు చోరీకి గురవుతున్నాయి. దీనిపై ఆలయ కమిటీ చైర్మన్ ఆలెం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామస్తులు నిఘా పెట్టారు. శుక్రవారం రాత్రి ఆలయం వద్ద ఉన్న రేకుల షెడ్డుకు ఉన్నఇనుప పైపులను దొంగిలించి ఆటోలో ఎత్తుకెళ్తున్నారు. దీనిని పసిగట్టిన గ్రామస్తులు ఆలయ చైర్మన్ అలెం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాపుకాసి పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు కబురు చేయటంతో వారు వచ్చి అనుమానితులను పోలీసు స్టేషన్ కు తరలించారు. దీనిపై ఆలయ చైర్మన్ అలెం వెంకటేశ్వర్లు పోలీసులకు పిర్యాదు చేశారు.








