Mahaa Daily Exclusive

  రూ.3లక్షల ఎంపీ నిధులతో సైడ్ డ్రైనేజీ నిర్మాణం పనులకు శ్రీకారం..

Share

  • ప్రారంభించిన సింగరేణి సర్పంచ్ మేదరి వీరప్రతాప్

కారేపల్లి,మహ: సింగరేణి మండల కేంద్రంలో రూ.3 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన సైడ్ డ్రైనేజీ కాలువను శనివారం స్థానిక సర్పంచ్ మేదరి వీరప్రతాప్(టోనీ) ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ కాలువ నిర్మాణంతో వర్షపు నీరు,మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు అవకాశం ఏర్పడి స్థానికులకు ఇబ్బందులు తగ్గనున్నాయని పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోటకూరి రాంబాబు,ఇమ్మడి తిరుపతిరావు,యాకూబ్, పెద్దమ్మ భాగ్యలక్ష్మి, తాజుద్దీన్,తొగర శ్రీను, విజయ్,అదేర్ల అంజయ్య, కాంట్రాక్టర్ గుగులోత్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.