• సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు లాంఛనంగా ఆమోదముద్ర.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో (హైకోర్టు) కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టులో ఇప్పటివరకు అదనపు న్యాయమూర్తులుగా సేవలు అందిస్తున్న ఐదుగురికి శాశ్వత న్యాయమూర్తులుగా (పర్మినెంట్ జడ్జీలు) హోదా దక్కింది. వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల పంపిన ప్రతిపాదనలకు లాంఛనంగా ఆమోదం లభించింది.
తాజా నిర్ణయంతో శాశ్వత న్యాయమూర్తులుగా కొలువుదీరనున్న వారిలో జస్టిస్ మహేశ్వర రావు, జస్టిస్ తూటా చంద్ర ధన శేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరి హరనాథ శర్మ, జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల పరంపరలో ఈ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏపీ హైకోర్టు న్యాయవ్యవస్థకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ ఐదుగురు న్యాయమూర్తులకు పర్మినెంట్ హోదా కల్పించడం ద్వారా పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం సహా హైకోర్టు పరిపాలనా, న్యాయపరమైన కార్యకలాపాల్లో మరింత వేగం పుంజుకోనుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.







