తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్లో భాగంగా మెదక్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను త్వరలో ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌ను పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి లభించిన విశేష స్పందనతో మధిర, మంథని, మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు.
ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని మరింత విస్తరించే చర్యల్లో భాగంగా మెదక్ లో మరో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను సిద్ధం చేశారు.
మెదక్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా మెదక్, మరియు నర్సాపూర్ constituency’s లోని దాదాపు 11 మండలాల పరిధిలో 395 ప్రభుత్వ పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 29,183 మంది విద్యార్థులకు ప్రతిరోజూ రుచికరమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారాన్ని అందిస్తారు.
విద్యార్థులకు సమతుల్యమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సహకారంతో రూపొందించిన మెనూ.
మెనూ
ఇడ్లీ – సాంబార్
పూరి – ఆలు కుర్మా
దోష – చెట్ని
ఉప్మా – చెట్ని
మిల్లెట్ ఇడ్లీ సాంబార్
బోండా – చట్నీ
ప్రతిరోజు ఒక వెరైటీ ఉంటుంది.
విద్యార్థులకు రోజు విడిచి రోజు పాలు కూడా అందిస్తారు.
విద్యార్థులకు ఉదయం పూట పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠశాల హాజరు మెరుగుపడేలా కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నారు.
విద్యార్థులు ఆకలితో పాఠశాలకు రాకుండా, ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఉత్సాహంగా చదువుపై దృష్టి సారించేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.








