Mahaa Daily Exclusive

  ఖైరతాబాద్ ఉప ఎన్నికలో.. కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం..

Share

  • ఖైరతాబాద్ ఉప ఎన్నికలో
  • కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం
  • కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్ , మహా : కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం చేయడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఆదివారం కరీంనగర్‌లో బండి సంజయ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ తను వినాయకుడితో పోల్చుకోవడం సరికాదని పేర్కొన్నారు. వినాయకుడిని చివరిలో నిమజ్జనం చేస్తారనే విషయం దానం నాగేందర్‌కు తెలియదా.? అని ప్రశ్నించారు. దానం నాగేందర్ నిండు నూరేళ్లు జీవించాలని బండి సంజయ్ కోరుకున్నారు. కాంగ్రెస్ తమకు పోటీనే కాదని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతల ఫాంహౌస్ సందర్శన ఓ జోక్ లాగా ఉందని వ్యంగ్యంగా మాట్లాడారు. కేసీఆర్ కుటుంబ ఫాంహౌస్‌లు ఏమైనా టూరిజానికి కేంద్రాలా.? అని ప్రశ్నించారు. ప్రైవేటు భూముల్లోకి వెళ్లడానికి కాంగ్రెస్ నేతలకు అధికారం ఎక్కడదని బండి సంజయ్ ప్రశ్నించారు.