Mahaa Daily Exclusive

  రైతు ఉత్పత్తిదారుల సంస్ధతో రైతులకు ప్రయోజనం..! సోసైటీ ఘనంగా ప్రజాపాలన దినోత్సవం..!

Share

కారేపల్లి, మహ : రైతు ఉత్పత్తిదారుల సంస్ధ(ఎఫ్.పీ.వో) తో రైతులకు అనేకప్రయోజనాలు లభిస్తాయని కారేపల్లి సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంను పురష్కరించుకోని సోసైటీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగరవేశారు. ఈసందర్బంగా చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారులసంస్ధ ద్వారా రైతులకు అవసరమైన పరికరాలు, ఎరువులు, పురుగుమందులు ఉంచవచ్చన్నారు. రైతు ఉత్పత్తులకు మంచి ధర కల్పించటానికి అవసరమైన నిల్వకేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు అవకాశం ఉందనితెలిపారు. రూ.2వేలు వాటాధానం చెల్లించి ఎప్.పీ.వో లో సభ్యులుగా చేరాలనికోరారు. చేరిన సభ్యుడికి రూ.4వేల విలువైన వాటా ధనం సర్టిఫికెట్ అందజేయటం జరుగుతుందన్నారు. సోసైటీ రుణాలు తీసుకున్న రైతులు వడ్డీలు చెల్లించి రెన్యూవల్ చేసుకోని వడ్డీ రాయితీ పొందాలనిసూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు, సంఘ కార్యదర్శి బొల్లు హనుమంతరావు, పాలకవర్గ సభ్యులు అడ్డగోడ ఐలయ్య, మర్సకట్ల రోశయ్య, కొత్తూరు రామారావు, డేగల ఉపేందర్, వడ్డే ఆదిలక్ష్మి, మధ్యాహ్నపు శ్రీను, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.