వరంగల్,దుగ్గొండి మహా ;
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో భూముల సమగ్ర రీ-సర్వేపై నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రీ-సర్వే ప్రక్రియలో భాగంగా చేపడుతున్న భూ కొలతలు, సరిహద్దుల నిర్ధారణ, భూ హక్కుల వివరాల నమోదు, భూ రికార్డుల పరిశీలన తదితర అంశాలను రైతులకు అధికారులు వివరించారు. రీ-సర్వే ద్వారా భూముల వివరాలు మరింత ఖచ్చితంగా నమోదు చేయడంతో పాటు భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
రైతులు తమ భూములకు సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, రీ-సర్వే సమయంలో అధికారులు నిర్వహించే కొలతలు, వివరాల పరిశీలనలో సహకరించాలని సూచించారు.
తమ భూములకు సంబంధించిన వివరాల్లో ఏవైనా అభ్యంతరాలు లేదా సందేహాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.
గ్రామ సభలో రైతులు సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. రీ-సర్వే ప్రక్రియపై పూర్తి వివరాలను తెలియజేశారు.
ఈ గ్రామ సభలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె కిషోర్ కుమార్, ఎడి సర్వే ల్యాండ్ మరియు రికార్డ్స్ అధికారి శ్రీనివాలు, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, డిఆర్డిఓ నాగపద్మజా, సర్పంచ్
శ్రీమాలతి, దుగ్గొండి తహసిల్దార్ సమ్మక్క తో పాటు గ్రామ రైతులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.








