కారేపల్లి, మహ. కారేపల్లి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డులో (రామలింగాపురం ) గణేష్ మండపం వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన ముత్తమ్మ హోటల్ నిర్వాహకులు మేకల రాంబాబుస్వామి ,ఉమా దంపతుల ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు
ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి,గణేష్ మండపం పూజారి వీరభద్ర చార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








