Mahaa Daily Exclusive

  పాఠశాలకు టేబుళ్లు కుర్చీలు స్పోర్ట్స్ డ్రెస్ వితరణ

Share

కారేపల్లి, మహ : కారేపల్లి మండలం పోలంపల్లి గేట్ తండా ప్రాథమికోన్నత పాఠశాల కు పోలంపల్లి మాజీ సర్పంచ్ భద్రునాయక్, జరపల రాజ్ కుమార్, చంద్రు ఫౌండేషన్ అధ్యక్షులు వీరన్న నాయక్ లు టేబులు, కుర్చీలతో పాటు విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు వితరణ చేశారు. బుధవారం సింగరేణి మండలం ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, పోలంపల్లి సర్పంచ్ దారావత్ హేమలతబాలాజీ చేతుల మీదుగా అందజేశారు. పాఠశాలకు వస్తువులు, విద్యార్థులకు దుస్తులు వితరణ చేసిన దాతలను ఎంఈఓ సర్పంచులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుగులోతు సర్వన్, స్కూల్ హెచ్ఎం రాములు, వీరన్న, దస్రు, వీరు, వార్డ్ నెంబర్లు రమేష్, లావణ్య, సుజాత, మాజీ సర్పంచ్ సకృ గ్రామ పెద్దలు గుగులోతు జగ్య, తేజ నాయక్ చందర్, రాందాస్, లక్ష్మణ్, వినాయక్, పండు, హరి రమేష్, కౌసల్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ సర్పంచ్ ధారావత్ బద్రు నాయక్ కుమారుడైన వినాయక్, జాశ్రీత పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పండ్లు, స్వీట్స్ పంపిణీ పంపిణీ చేశారు.

విద్యార్థులకు యూనిఫాం అందజేత

మండల పరిధిలోని అప్పాయిగూడెం, మోకాళ్ళగుంపు, పోలంపల్లి పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన యూనిఫామ్, షూస్ లను సర్పంచులు దండు ప్రవీణ్, దారావత్ హేమలత బాలాజీ లు అందజేశారు.