Mahaa Daily Exclusive

  గాంధీపురం రైల్వే గేట్ వద్ద ప్రమాదకరంగా గుంతలు..! ప్రమాదాలు జరుగుతున్నపట్టని ఆర్‌అండ్‌బీ, రైల్వే అధికారులు..

Share

కారేపల్లి మహా :ఖమ్మం – ఇల్లందు ప్రధానరహదారిపై గల గాంధీపురం రైల్వే గేట్ వద్ద భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. నిత్యం 24 గంటలు వందలాది వాహనాలు ఈ మార్గం మీది రాకపోకలు సాగిస్తుంటాయి. గాంధీపురం రైల్వే గేట్ కు ఇరువైపుల రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో, వర్షం పడిన సమయంలో గుంతల్లో నీరు నిలవడంతో అవి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో గుంతల కారణంగా పలువురు ప్రమాదాలకు గురై మరణించడం, తీవ్ర గాయాలపాలై చికిత్స పొందిన ఘటనలు ఉన్నాయి. గేటు వద్ద మరమ్మత్తులుచేయాలని స్థానికులు ఆర్ అండ్ బీ, రైల్వే అధికారులకు విన్నవించిన స్పందన లేదని స్ధానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారిన గుంతలను వెంటనే పూడ్చి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.