Mahaa Daily Exclusive

  శ్రీశైలానికి నిలిచిన వరద.. నిల్‌కు చేరిన ఇన్‌ఫ్లో….

Share

శ్రీశైలానికి నిలిచిన వరద.. నిల్‌కు చేరిన ఇన్‌ఫ్లో.
*22,848 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో.. 864.20 అడుగులకు నీటిమట్టం
*కుడి జల విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేత.. ఎడమ కేంద్రంలో కొనసాగింపు

శ్రీశైలం, మహా:

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. జలాశయానికి ప్రస్తుతం ఇన్‌ఫ్లో నిల్‌గా ఉండగా.. వివిధ మార్గాల ద్వారా 22,848 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు, విద్యుత్‌ ఉత్పత్తిపై అధికారులు అప్రమత్తంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

864.20 అడుగులకు నీటిమట్టం

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 864.20 అడుగుల వద్ద నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 119.49 టీఎంసీల నీరు నిల్వగా ఉన్నట్లు నీటిపారుదల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జలాశయానికి కొత్తగా వరద చేరకపోవడంతో నీటి విడుదల, నిల్వలపై అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

కుడి కేంద్రంలో నిలిచిన ఉత్పత్తి

శ్రీశైలం కుడి జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు ఎడమ జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. జలాశయం నుంచి కొనసాగుతున్న ఔట్‌ఫ్లో, అందుబాటులో ఉన్న నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ ఉత్పత్తి, నీటి విడుదలను అధికారులు సమన్వయం చేస్తున్నారు.