Mahaa Daily Exclusive

  బిఆర్ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టు..!

Share

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 10 మహా:

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బిఆర్ఎస్వి నాయకులను, పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి, బిఆర్ఎస్వి పిలుపునివ్వడంతో, పోలీసులు జిల్లాలో ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఇబ్రహీంపట్నం పోలీసులు.. నియోజకవర్గం బిఆర్ఎస్వి అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్,జిల్లా నాయకులు మడుపు శివసాయిని అక్రమంగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్రమ అరెస్టులతో తమ లక్ష్యాన్ని నిర్వీర్యం చేయలేరని జగదీష్ అన్నారు.