కారేపల్లి, మహ: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పుస్తకంపై రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల హిస్టరీ లెక్చరర్ తమ్మిశెట్టి శ్రీనివాస్ ను మాస్టర్ ట్రైనర్ గా ఇంటర్మీడియట్ బోర్డు ఎంపిక చేసింది. హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మారిన చరిత్ర పుస్తకం పై రాష్ట్రస్థాయిలో హిస్టరీ లెక్చరర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు శ్రీనివాస్ ను ఎంపిక చేయడం పట్ల కారేపల్లి కళాశాల, అధ్యాపక బృందం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.







