Mahaa Daily Exclusive

  బంజారాహిల్స్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR)

Share

ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ డివిజన్ ఉదయ్ నగర్‌లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా MGR గారు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, పల్స్ పోలియో కార్యక్రమం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ, దేశ భవిష్యత్తైన చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ ప్రతి కుటుంబం, ప్రతి సమాజం బాధ్యత అని పేర్కొన్నారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలకు ప్రజలందరూ పూర్తి సహకారం అందించాలని, ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు మరింత బలంగా, సురక్షితంగా ఉంటుందని MGR గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో జెట్టి విజయ్ కుమార్ (ఆటో), నరేందర్, శౌరి రాజ్, రాధా గార్లతో పాటు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.