Mahaa Daily Exclusive

  హైదరాబాద్ తట్టి అన్నారంలో కలకలం

Share

  • మహిళ మృత దేహాన్ని కుక్కలు పీక్కు తిన్న వైనం
  • కొద్ది రోజుల క్రితం అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానం

హైదరాబాద్‌, మహా : నగరంలోని నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదకర ఘటన వెలుగు చూసింది. తట్టి అన్నారం సమీపంలో కుక్కలు పీక్కుతింటున్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలిని ఓయూ మాణికేశ్వర్‌ నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు. ఆమె కనిపించకపోవడంతో సెప్టెంబర్‌ 28న ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ ఫిర్యాదు నమోదైనట్లు తెలిపారు. మంగమ్మ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి, మృతదేహాన్ని అక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు పూర్తయిన తర్వాతే మరణానికి అసలు కారణం, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. బాధ్యులను గుర్తించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.