- రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఫార్మసీ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్
- ఫార్మసీ యాక్ట్ 1948 – సెక్షన్ 42 కఠిన అమలుకు వినతి
- ఔషధ నియంత్రణ చట్టాల అమలుకు పక్కా కార్యాచరణ
- డైరెక్టర్ జి. రాంధన్
హనుమకొండ, మహా ;
తెలంగాణ టీజీ సేఫ్ డ్రగ్స్ కంట్రోల్ విభాగం రాష్ట్ర డైరెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జి. రాంధన్ ను రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పు భాస్కరరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఫార్మసీ యాక్ట్ 1948లోని సెక్షన్ (42) మరింత కఠినంగా అమలు చేయాలని కమ్యూనిటీ ఫార్మసీలల్లో అర్హులైన ఫార్మసిస్టుల ద్వారానే మందుల పంపిణీ జరిగేలా చూడాలని, వినియోగదారులకు మరింత మెరుగైన చట్టబద్దమైన సేవలను అందించేందుకు కృషిచేయాలని ఈ సందర్భంగా ఉప్పు భాస్కర్ రావు డైరెక్టర్ ను కోరారు.
ఈ సందర్భంగా
డైరెక్టర్ రాంధన్ మాట్లాడుతూ ఔషధ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే ధ్యేయంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్టు ను నిర్దిష్టంగా పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలపారు. సమాజంలో ఫార్మసిస్టుల సేవలు ఎంతో కీలకమైనవని కొనియాడారు. ఫార్మసిస్టులందరూ అంకితభావంతో, చిత్తశుద్ధితో తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
రానున్న రోజుల్లో టిజి సేఫ్ కమిషనర్ పర్యవేక్షణలో డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి సంబంధించిన చట్టాలను పటిష్టంగా అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు చెప్పారు. టి.జి. సేఫ్ కమిషనర్ అంజన్ కుమార్ నేతృత్వంలో సమర్థవంతమైన నాయకత్వం మార్గదర్శకత్వంలో ప్రజలకు మరింత మెరుగైన, చట్టబద్ధమైన సేవలు అందించేందుకు డ్రగ్స్ కంట్రోల్ విభాగం నిరంతరం శ్రమిస్తుందని స్పష్టం చేశారు.








