Mahaa Daily Exclusive

  సీకేఎం లెక్చరర్ సతీష్ కుమార్ ను విధుల నుంచి తొలగించాలి…

Share

  • సీకేఎం లెక్చరర్ సతీష్ కుమార్ ను విధుల నుంచి తొలగించాలి
  • స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు

వరంగల్, కలెక్టరేట్ మహా;

సికేఎం కళాశాల జువాలజీ లెక్చరర్ ఎన్సిసి కెప్టెన్ సతీష్ కుమార్ ను విధుల నుండి పూర్తిగా తొలగించాలని
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవికి సోమవారం ప్రజావాణిలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తురి సాయికుమార్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్తురి సాయికుమార్ మాట్లాడుతూ సీకేఎం కళాశాల లోని కొంతమంది విద్యార్థీనిలను అలాగే ఎన్సిసి విద్యార్థీనిలను కూడా లైంగికంగా వేధిస్తున్న కళాశాల జువాలజీ లెక్చరర్ ఎన్సిసి కెప్టెన్ సతీష్ కుమార్ పై ఎంక్వయిరీ జరుగుతున్న క్రమంలోనే అతను కాలేజీల్లో విధులు నిర్వర్తిస్తూ విద్యార్థినీల ను భయబ్రాంతులకు గురి చేస్తూ నా పై జరుగుతున్న ఎంక్వయిరీలో అధికారులు గానీ వేరే ఇతరులు ఎవరు అడిగినా సానుకూలంగా సౌమ్యుడని చెప్పాలని భయాందోళనలకు గురి చేస్తున్న లెక్చరర్ సతీష్ ను తక్షణమే విధుల నుంచి పూర్తిగా తొలగించాలని బాధిత విద్యార్థిని లకు న్యాయం చేయాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్ యూనియన్ హనుమకొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చెట్టు పల్లి శివకుమార్ కేడీసీ కాలేజ్ అధ్యక్ష కార్యదర్శులు రాజ్ కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు.