పురాతన శివాలయానికి పూర్వవైభవం దిశగా అడుగులు
కారేపల్లి,మహా:
కారేపల్లి గ్రామంలో గత పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న పురాతన పాత శివాలయం భూ వివాదానికి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు ఆధ్వర్యంలో సోమవారం భూ యజమానులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు మాట్లాడుతూ ఇదే భూమి వివాదంలో గతంలో పలువురిపై ప్రైవేటు వ్యక్తులు కేసులు కూడా పెట్టినట్లు తెలిపారు.భూ వివాదం విషయంలో భూ యజమానులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపించినట్లు తెలిపారు.కాకతీయుల నాటి ఈ శివాలయం ను తిరిగి పునర్నిర్మించి గుడికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని అన్నారు.








