*ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
*వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్, కలెక్టరేట్ మహా;
వరంగల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉదయం10 00 గంటల నుండి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా పరిధిలో జిల్లా స్థాయి అధికారులు రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ డివిజన్ అధికారులు మండల స్థాయిలో మండల స్థాయి అధికారులు ప్రజావాణి నిర్వహిస్తారని, ఈ ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రకటన ద్వారా తెలిపారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.








