కమిషనర్‌కు సమ్మె నోటీస్ అందజేసిన జేఏసీ
వరంగల్, మహా ;
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా వివిధ విభాగాలు, వివిధ క్యాడర్లలో పనిచేస్తూ ప్రజలకు నిరంతరం ఆరోగ్య సేవలు అందిస్తున్న సుమారు 15000 వేల మంది నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎన్ హెచ్ ఎం జేఏసీ తదుపరి కార్యాచరణను ప్రకటించింది.
రెగ్యులరైజేషన్, ఉద్యోగ భద్రత, సమాన వేతనం, పిఆర్సి పెండింగ్ వేతనాలు, ఇన్క్రిమెంట్లు, లాయల్టీ బోనస్, మాతృత్వ సెలవులు, ఇన్సూరెన్స్ తదితర సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎన్ హెచ్ ఎం జేఏసీ డిమాండ్ చేస్తోంది.
సెప్టెంబర్ 28 న చలో కమిషనరేట్
ఈ నేపథ్యంలో శనివారం హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు సెప్టెంబర్ 28 సోమవారం సాధారణ సెలవు ఇవ్వాలని అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ మదన్ మోహన్ రావు ,డాక్టర్ కృష్ణారావు లకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నవీన్ ఎన్ హెచ్ ఎం జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుక్ముద్దీన్ , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ,రహమాన్, రాష్ట్ర కోశాధికారి మొగిలి నరేష్ , జ్యోతి, శిరీష,వినోద్ , రాకేష్ తదితరులు ఉన్నారు.








