Mahaa Daily Exclusive

  ఆదర్శ్ యూత్ లడ్డు 51 వేలకు కైవసం చేసుకున్న కట్టెల రవీందర్….

Share

  • ఆదర్శ్ యూత్ లడ్డు 51 వేలకు కైవసం చేసుకున్న కట్టెల రవీందర్…
  • మండపని సందర్శించిన కౌన్సిలర్ భార్గవిరాజు
  • గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు
  • అంగరంగ వైభవంగా నిర్వహించిన శోభయాత్ర

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 25 మహా:
ఆదర్శ్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేశుడు లడ్డూ వేలం పాటలో, కట్టెల రవీందర్ 51 వేల రూపాయలకు సొంతం చేసుకున్నాడు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, పదవ వార్డు ఖానాపూర్ ఆదర్శ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేశునికి నిష్ట నియమాలతో భక్తిశ్రద్ధలతో నవరాత్రులు ప్రత్యేక పూజలు చేసి కొలిచిన, ఆ యొక్క గణనాధుని లడ్డు వేలం పాట నిర్వహించగా, అదే గ్రామానికి చెందిన కట్టెల రవీందర్ 51 వేల రూపాయలకు, మహాగణపతి ప్రసాదాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆదర్శ యూత్ ఆహ్వానం మేరకు వినాయక మండపాని సందర్శించిన, గ్రామ కౌన్సిలర్ దొంతరమోని భార్గవిరాజు, గణనాథుని ఆశీర్వాదం పొందిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన శోభయాత్రలో పాల్గొన్న భార్గవిరాజు యూత్ సభ్యులతో కలిసి ఉత్సాహంగా ఊరేగింపును కొనసాగించారు.