Mahaa Daily Exclusive

  దానం నాగేందర్‌ అనర్హతపై నేడు తీర్పు….

Share

దానం నాగేందర్‌ అనర్హతపై నేడు తీర్పు.
• మధ్యాహ్నం 3.45 గంటలకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిర్ణయం.
• కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి పిటిషన్లపై గత నెలలో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్‌.

హైదరాబాద్‌, మహా:

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నేడు తీర్పు వెలువరించనుంది. మధ్యాహ్నం 3.45 గంటలకు తీర్పు వెల్లడించనున్నట్లు న్యాయస్థానం నిర్ణయించింది. దానం నాగేందర్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

వాదనలు విన్న ధర్మాసనం

పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గత నెలలో పూర్తిగా విన్నది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు దానం నాగేందర్‌ ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరగా, ప్రతివాదుల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తయిన అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

రాజకీయంగా ప్రాధాన్యం

దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారంపై రేపటి తీర్పు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తీర్పులో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందన్న దానిపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పు అనంతరం తదుపరి న్యాయ, రాజకీయ పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది కీలకంగా మారనుంది.