Mahaa Daily Exclusive

  కారేపల్లి గౌడ బజార్‌లో గణేశునికి ఇమ్మడి ప్రత్యేక పూజలు..

Share

 

కారేపల్లి, మహా: కారేపల్లి గౌడ బజార్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలు విజయవంతంగా, ప్రశాంతంగా జరగాలని ఆకాంక్షించారు.
సింగరేణి మండల ప్రజలందరిపై విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు పోలీసుల సూచనలు, సలహాలను పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.