- చోరీకి గురైన విద్యుత్ మీటర్ అధికారులకు అప్పగింత!
- అధికారుల ఆదేశాలతో తొలగించిన చోటే బిగించిన విద్యుత్ మీటర్
- విద్యుత్ లైన్మెన్ కృష్ణను హెచ్చరించిన అధికారులు
- ఇది పునరావృతం కావద్దని మందలింపు
ఆదిభట్ల సెప్టెంబర్ 15 మహా:
విద్యుత్ అధికారులు ఆదేశాలతో బాధితుల ఇంటికి విద్యుత్ మీటరును, తొలగించిన చోటే బిగించారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గత పది రోజుల క్రితం, బొంగులూరు ఇందిరమ్మ కాలనీలో దొంగతనానికి గురైన విద్యుత్ మీటరు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, విద్యుత్ అధికారులకు అప్పగించిన లైన్మెన్. బాధితుల ఫిర్యాదు మేరకు ఆదిభట్ల విద్యుత్ అధికారి ఆదేశాలతో మంగళవారం బాధితుల ఇంటికి అమర్చిన విద్యుత్ సిబ్బంది. సదరు విద్యుత్ లైన్మెన్ కృష్ణను ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని, అధికారులు హెచ్చరించడం జరిగింది. గతంలోనూ ఇదే రీతిలో జరగడంతో, అతనిపై అధికారులు గుర్రుగా ఉన్నారు. ఇది మళ్ళీ పునరావృతం కాకూడదని, లేదంటే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మందలించారు.








