Mahaa Daily Exclusive

  రామకృష్ణాపురంలో వినాయకుడిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు..! అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గుడిపూడి తిరుమల రావు..

Share

కారేపల్లి, మహ: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి తిరుమల రావు సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పిట్టల మధు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తిరుమల రావు పాల్గొని, భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా తిరుమల రావు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రామకృష్ణాపురం గ్రామ ప్రజలతో పాటు సింగరేణి మండల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఉండాలని ఆకాంక్షించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో ఐక్యత, సోదరభావం, ఆధ్యాత్మిక భావనలను మరింత పెంపొందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వొరికొర్ల వీరభద్రం, షేక్ హాజిమియా, పొట్లకాయల మహేష్, సామినేని తిరుపతిరావు, పిట్టల మధు, అడప వెంకటేశ్వర్లు, సంతోష్, సురేష్, చిన్న వెంకన్న, సాయికుమార్, కళ్యాణ్, కార్తీక్, చింతకాయల రామకృష్ణ, వాసు రమేష్, దొడ్డ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.