విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుడు బొజ్జ గణపతి
ఇబ్రహీంపట్నంలో వినాయక చవితి సంబరాలు
లంబోదరుడికి భక్తుల ప్రత్యేక పూజలు
భక్తులతో కిటికీటలాడిన వినాయక మండపాలు
గణనాధుని సేవలో యువత…
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 14 మహా: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు బొజ్జ గణపయ్య అని, భక్తులు ఆయనను కీర్తిస్తూ కొలుస్తారు. వినాయక చవితి సందర్భంగా యువత సంబరాలతో మండపాల వద్ద సందడి నెలకొంది. అంగరంగ వైభవంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మండలాల్లోని గ్రామ గ్రామాన, గల్లి గల్లిన గణనాథుని ప్రతిమను ప్రతిష్టించి, నిష్ట నియమాలతో భక్తులు వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా యువత వినాయక చవితి వచ్చిందంటే వారం పది రోజుల ముందు నుంచే హడావుడి చేస్తూ, మండపాలను మా ప్రత్యేకంగా అలంకరించి అందులో వినాయకుని ప్రతిష్టించిన నాటి నుంచి నిమజ్జనం వరకు ప్రతిరోజు ప్రత్యేకంగా అలంకరణలతో పూజలు చేస్తే ఆయన సేవలో మునిగిపోతారు. ఇబ్రహీంపట్నంలోని మండపాల వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, సమస్తలోకం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఎల్లప్పుడూ వర్ధిల్లాలని కోరారు.
భక్తులకు లంబోదరుని ముద్దులొలికే రూపం…
గణనాథుని గంభీరమైన, శాంతస్వరూపమైన నడక గుర్తుకువస్తాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా భాగవతులు, కవులు వినాయకుని వైభవాన్ని, ఆయన నడక తీరును కీర్తిస్తూ, భజనలు చేస్తూ అనేక పాటలు పాడుతుంటారు.
గణనాథుని రూపం, ఆయన తీరులోని అంతరార్థాలు:
గజముఖం.. ఇది గంభీరత్వానికి, వివేకానికి ప్రతీక.
లంబోదరం.. సృష్టిలోని సమస్తాన్ని తనలో ఇముడ్చుకున్న విశ్వరూపానికి సంకేతం.
మూషికం వాహనం.. అంతటి భారీ కాయుడైన గణనాథుడు చిన్న ఎలుకను వాహనంగా చేసుకోవడం ఆయనకున్న నిరాడంబరతను, అహంకారం లేని తీరును చూపుతుంది.
శాంత స్వభావం.. విఘ్నాలను తొలగించే అధిపతి అయినప్పటికీ, ఆయన తీరు ఎల్లప్పుడూ ప్రశాంతంగా, భక్తులను అనుగ్రహించేలా ఉంటుంది. గణనాధుని కొలిచే ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకంతో భక్తులు స్వామివారికి ప్రత్యేకంగా సేవలందిస్తూ ఉంటారు.








