*సీసీగా ఇషాక్.. పీఆర్వోగా తిరుపతి
*వేణుగోపాల్ రావు, మోహనకృష్ణ బదిలీ
హనుమకొండ, మహా ;
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో క్యాంపు క్లర్క్ (సీసీ) వేణు గోపాల్‌రావు, పౌర సంబంధాల అధికారి (పీఆర్వో) లు మోహనకృష్ణ బదిలీ అయ్యారు. వారి స్థానాల్లో స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్న ఏవో ఇషాక్ ను సీసీగా, సుబేదారి పోలీస్‌స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న తిరుపతి ని పీఆర్వో గా నియమించారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.








