Mahaa Daily Exclusive

  ఆదిభట్ల విద్యుత్ లైన్మెన్ కృష్ణపై పోలీసులకు ఫిర్యాదు!

Share

  • ఆదిభట్ల విద్యుత్ లైన్మెన్ కృష్ణపై పోలీసులకు ఫిర్యాదు!
  • అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
  • గతంలోనూ అదే మీటరు ఎత్తుకెళ్లాడని ఆరోపణ!

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 13 మహా:
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగులూరు ఇందిరమ్మ కాలనీలో, లైన్మెన్ కృష్ణ, తమ ఇంటి విద్యుత్ మీటర్ దొంగతనం చేశారంటూ ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. ఆదిభట్ల విద్యుత్ లైన్మెన్ కృష్ణ మరో ఇద్దరు ఆంధ్రప్రభ రిపోర్టర్ లక్ష్మయ్య, ఐ న్యూస్ రిపోర్టర్ అంజిలతో కలిసి, సదరు మహిళ యొక్క ఇంట్లో ఎవరు లేని సమయం చూసి, ప్రహరీ గేటుకు తాళం వేసి ఉన్నా అక్రమంగా గోడ దూకి విద్యుత్ మీటర్ దొంగతనం చేశారంటూ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఇలాగే లైన్మెన్ కృష్ణ, ఈ యొక్క మహిళ ఇంటికి అమర్చిన విద్యుత్ మీటరును ఎత్తుకెళ్లడంతో, అతని పై అధికారులైన విద్యుత్ ఏడి ఏఈలకు ఫిర్యాదు చేయగా, ఆ యొక్క విద్యుత్ మీటరును, మళ్లీ యధా స్థానంలో ఆ ఇంటి గోడకు అమర్చడం జరిగింది. మళ్లీ విద్యుత్ మీటర్ ఎత్తుకెళ్లిన, లైన్మెన్ కృష్ణ మరో ఇద్దరి జర్నలిస్టులతో కలిసి కుమ్మకై ఇలాంటి దుర్మార్గానికి వడికట్టాడని, సదరు మహిళా ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ మీటర్ వెతికెళ్ళిన వారిపై చట్టపరిమైన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన మహిళలకు, పోలీసులు దర్యాప్తు చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు ఆమె తెలిపారు.