కారేపల్లి, మహ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సింగరేణి మండల ప్రజలందరికీ కాంగ్రెస్ నాయకులు శ్రీ గుడిపూడి తిరుమల రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సింగరేణి మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని, వినాయకుడి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.
వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని గుడిపూడి తిరుమల రావు ఆకాంక్షించారు.








