Mahaa Daily Exclusive

  వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి….

Share

  • వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి….
  • టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జిల్లా కలెక్టర్

 

వరంగల్, కలెక్టరేట్ మహా ;

 

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో అతి భారీ వర్షాలు, జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద ఆదేశించారు.

 

భారీ వర్షాల నేపద్యం లో జిల్లా కలెక్టర్ సంబధిత అధికారులతో ఆదివారం సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి, ముందస్తు జాగ్రత్త ల నిమిత్తం జిల్లా ప్రజల పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, హెల్త్ క్యాప్ లు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించాలని సంబంధిత వైద్యాధికారులను

ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, కల్వర్టులు, వంతెనల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

 

వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

 

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

 

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలని, అధికారులు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద సూచించారు.

జిల్లా కలెక్టరేట్ లో

ప్రజలసౌకర్యార్థం కంట్రోల్ రూమ్ లో టోల్ ఫ్రీ నెంబర్.

9154252936, 24 గంటలు అందుబాటులో ఉంటుందని ప్రజలకు సూచించారు.