Mahaa Daily Exclusive

  రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి…

Share

  • రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
  • మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలింపు
  • వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని జీఆర్పీ విజ్ఞప్తి

వరంగల్, మహా ;

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జీఆర్పీ సీఐ వడ్డే నరేష్‌కుమార్ తెలిపిన
వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున ఇంటి కన్నె, కేసముద్రం రైల్వే స్టేషన్ల మధ్య డౌన్‌లైన్‌లోని కిలోమీటర్ నంబర్ 418/24-26 వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. వ్యక్తిగత కారణాలు లేదా ఇతర కారణాలతో గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.