Mahaa Daily Exclusive

  విద్యార్థులు మాదకద్రవ్యాల కు దూరంగా ఉండాలి…

Share

  • విద్యార్థులు మాదకద్రవ్యాల కు దూరంగా ఉండాలి
  • మడికొండ సీఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

కాజీపేట, మహా ;

వరంగల్ నగర పోలీస్ కమీషనర్ ఎన్ శ్వేత, ఐపిఎస్ ఆదేశాల మేరకు జాగృతి పోలీస్ కళా బృందంచే శనివారం సాయంత్రం మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడిపికొండ సూర్య కుటీర్ లోని శ్రీ చైతన్య సీబీఎస్సీ హై స్కూల్ లో మడికొండ సీఐ పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చదువుకునే పిల్లలు గంజాయి డ్రగ్స్, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వంటి చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దని, ఆడ పిల్లలు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని, మొదట చదువు పై దృష్టి సారించాలని , సైబర్ మోసాల బారిన పడవద్దని, రోడ్డు ప్రమాదాలు, డయల్ 112, షీ టీమ్స్ బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, భరోసా, గురించి వివరిస్తూ, తల్లితండ్రులు చెప్పిన మాట వినాలని, సైబర్ మోసాలకు గురైతే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి ఫోన్ చేయాలని సూచించారు, ఈ సందర్భంగా పలు సామాజిక అంశాల పై పోలీస్ జాగృతి కళా బృందం వారు ఆలపించిన పాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసాయి.
ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు జె.రాజబాబు, పి రాజకుమార్, ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, అధ్యాపక బృందం,కళా బృందం ఇంచార్జి ఉమెన్ ఏఎస్సై నాగమణి, తో పాటు హెడ్ కానిస్టేబుల్స్ విలియమ్, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ రత్నయ్య , పూల్ సింగ్, హోమ్ గార్డ్స్, శ్రీనివాస్ , నారాయణ, విక్రమ్ రాజు, చిరంజీవి, 150 మంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.