- అద్దె చెల్లించలేదని వ్యాపారి షాప్ కు తాళం వేసిన యజమాని
- మట్వాడ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
వరంగల్, మహా ;
హనుమకొండ నగరంలోని ఫుడ్ కోర్టు నడుపుతున్న లింగాల కేదారి దంపతుల ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే వరంగల్ నగరంలో అద్దె చెల్లించలేదని యజమాని అద్దెకు ఉంటున్న వారి దుకాణం లోని సామాన్లు బయపడేసి
యజమాని షాప్ కు తాళం వేసిన ఘటన చోటు చేసుకుంది. అది కూడా
వ్యాపారి లేని సమయంలో యజమాని షాప్ కు తాళం వేసాడని వ్యాపారి ఆరోపిస్తున్నాడు. సదరు వ్యాపారి
ఇదేంటని ప్రశ్నిస్తే ఇంటి యజమాని ఏం చేసుకుంటావో చేసుకోమంటూ బెదిరింపులకు దిగడం తో ఒకరు వ్యాపారి మానసిక ఆందోళనకు గురవుతూ ఏమి చేయలేక తన షాపులో
విలువైన వస్తువులు ఉన్నాయంటూ అద్దె విషయంలో తనకు కాస్త టైం ఇచ్చి న్యాయం చేయాలని మట్వాడ పోలీసులను ఆశ్రయించి స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాను చేసిన ఫిర్యాదు పై పోలీసులు స్పందించి బెదిరింపులకు పాల్పడుతున్న ఆర్కే కాంప్లెక్స్ యజమాని మద్ది పవన్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాడు.








