Mahaa Daily Exclusive

  తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం…

Share

  • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం
  • కొండా సురేఖకు అధిష్ఠానం నుంచి పిలుపు

వరంగల్,మహా ;

మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీకి వెంటనే రావాలని ఆమెకు అధిష్ఠానం పెద్దల నుంచి సందేశం అందింది. మంత్రి పదవి కోల్పోయిన కొండా సురేఖతో నిన్న (శుక్రవారం) తెలంగాణ పార్టీ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ స్వయంగా మాట్లాడారు. కొండా సురేఖకు కేబినెట్ స్థాయి పదవి ఇచ్చే యోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తుంది.
వరంగల్ జిల్లాలోని గీసుకొండలో కొండా సురేఖ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె కుమార్తె సుస్మిత పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పరకాల అసెంబ్లీ స్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల పై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖను వివరణ కోరింది. ఈ సందర్భంగా కమిటీకి ఆమె రెండు లేఖలు రాశారు.
ఈ వ్యవహారం పై క్రమశిక్షణ కమిటీ.. పీసీసీ చీఫ్‌కు నివేదిక అందించింది. ఈ నివేదికను పార్టీ అధిష్ఠానానికి తెలంగాణ పీసీసీ చీఫ్ అందించారు. ఈ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్త్‌రఫ్ చేశారు. అయితే తాను ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటానని పేర్కొన్నారు.

మరో వైపు ఫేస్‌బుక్‌ వేదికగా ‘బిగ్‌ అప్డేట్ కమింగ్ సూన్’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే దీంతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా సురేఖను పార్టీ అధిష్ఠానం ఢిల్లీ రావాలంటూ సందేశం పంపడం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.