వరంగల్, కార్పొరేషన్ మహా;
పైప్‌లైన్ లీకేజీ కారణంగా మడికొండ రైల్వే ట్రాక్ సమీపంలో మరమ్మతు పనులు చేపట్ట నున్న నేపథ్యంలో 60 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి నీటి సరఫరాను బుధ, గురువారం) రెండు రోజుల పాటు నిలిపివేయడం లేదా అంతరాయం కలిగే అవకాశం ఉందని జిడబ్ల్యూఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
దీంతో పరకాల, వర్ధన్నపేట, ఘన్పూర్, వరంగల్ తూర్పు నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం పడనుంది.
*ప్రభావిత ప్రాంతాలు:*
పరకాల నియోజకవర్గం:
స్తంభంపల్లి, వసంతాపూర్, దుప్పకుంట, గాడెపల్లి, బొల్లికుంట.
వర్ధన్నపేట నియోజకవర్గం:
నక్కలపల్లి, ఆలీపూర్, జక్కలోద్ది, అమ్మవారిపేట, బట్టుపల్లి, కడిపికొండ, రాంపేట, కుమ్మరిగూడెం, అయోధ్యాపురం, తారాలపల్లి, మడికొండ, బాలాజీనగర్, దేవన్నపేట, ఎల్లాపూర్, మునిపల్లి.
ఘన్పూర్ నియోజకవర్గం:
రాంపూర్, ఉనికిచర్ల, టేకులగూడెం.
వరంగల్ తూర్పు నియోజకవర్గం..
శివనగర్, పుప్పాలగుట్ట, చింతల్, ఫోర్ట్ వరంగల్, శంభునిపేట, రంగశాయిపేట, సుభాష్‌నగర్, కరీమాబాద్, పెరుకవాడ, మిల్స్ కాలనీ, బీరన్నకుంట.
మరమ్మతు పనులు పూర్తయిన అనంతరం నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు రెండు రోజుల పాటు నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని ఆయన సూచించారు.








