Mahaa Daily Exclusive

  జలమయమైన బొంగులూరు టిసిఎస్ ప్రధాన దారి..

Share

  •  వినాయక నిమజ్జనాల వేల రోడంత జలమయం!
  •  ప్రపంచ స్థాయి టిసిఎస్ కంపెనీ ముందు మరుగునీరు.!
  • మరుగునీటిలోనే వాహనాల రాకపోకలు
  • ఇబ్బందుల్లో వాహనదారులు పాదచారులు

ఆదిభట్ల సెప్టెంబర్ 25 మహా:

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసిఎస్) నుండి తెలంగాణ చాయ్ వరకు పూర్తిగా జలమయమైన ప్రధాన రహదారి. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరద నీరు రోడ్లో నిలిచిపోవడంతో ఒకపక్క రోడ్ అంతా జలమయమైంది. దీనికి తోడు చుట్టుపక్కల కాలనీలోని డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్డుపై నిలిచిన నీరంతా మురికినీరుగా మారిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, వినాయక నిమజ్జనాలు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. డ్రైనేజీ పొంగిపొర్లి దుర్వాసన వెదజల్లడంతో పాదచారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుపుతున్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక చొరవ చూపి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరారు.

ప్రపంచ స్థాయి కంపెనీ ముందు చేరిన మరుగునీరు…

టిసిఎస్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీ ఉండడంతో తరచూ వందల సంఖ్యలో వాహనాలు వస్తూ వెళ్తూ ఉంటాయి. టిసిఎస్ ఎదురుగా ఉన్న బొంగులూరు ఆదిభట్ల ప్రధాన రహదారి పూర్తిగా జలమయం కావడంతో, వర్షపు నీరు మరుగునీరు ఓకే చేరడంతో దుర్వాసన వెదజల్లుతున్న కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అధికారులు వెంకటేష్ స్పందించి త్వరగా తిను ఒక మార్గనిటీని తరలించే ప్రయత్నం చేయాలని ప్రజల కోరుతున్నారు.