Mahaa Daily Exclusive

  కొలువుదీరిన ఆరోగ్య శ్రీ ఎంప్లాయీస్ నూతన కార్యవర్గం..

Share

  • కొలువుదీరిన ఆరోగ్య శ్రీ ఎంప్లాయీస్ నూతన కార్యవర్గం
  • యూనియన్‌ అధ్యక్షుడిగా కొండపర్తి శ్రీకాంత్

వరంగల్ మహా ;

రాజీవ్ ఆరోగ్య శ్రీ ఎంప్లాయీస్ యూనియన్‌ వరంగల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు. వరంగల్‌ లోని రీజినల్ ఐ హాస్పిటల్‌ లో యూనియన్‌ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి సాంబారి రాజేష్ ఆధ్వర్యంలో గౌరవ సలహాదారు నోముల లలిత ఎన్నికల ప్రక్రియను నిర్వహించగా, సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా
నూతన కార్యవర్గం
అధ్యక్షులుగా కొండపర్తి శ్రీకాంత్,
ప్రధాన కార్యదర్శి నల్లబెల్లి అనిల్,
ఉపాధ్యక్షులు మోటె మహేష్,
కోశాధికారి గంట రజినీ,
ఆర్గనైజింగ్ కార్యదర్శి డొంఠోజు కుమారస్వామి గా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కొండపర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ, తన పై నమ్మకంతో వరంగల్ జిల్లా ఆరోగ్య శ్రీ ఎంప్లాయీస్ యూనియన్‌ అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులు తన పై ఉంచిన విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతా యుతంగా పనిచేస్తానన్నారు.
ఉద్యోగుల సమస్యలను యూనియన్‌ దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ యూనియన్‌ ను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి సభ్యుడి సహకారంతో ముందుకు సాగుతామని శ్రీకాంత్ తెలిపారు.
నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా యూనియన్‌ సభ్యులు, ఉద్యోగులు నూతన అధ్యక్షుడు కొండపర్తి శ్రీకాంత్‌ తో పాటు కార్యవర్గ సభ్యుల తో పాటు ఇతర యూనియన్ నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.